హైదరాబాద్: 28°C
తెలంగాణ

శేష జీవితం కళా సేవకే అంకితం కావాలి: ఎమ్మెల్సీ

JGL: ఉపాధ్యాయునిగా, కళాకారునిగా ఎలిగేటి రాజేంద్రప్రసాద్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. జగిత్యాలలో తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజేంద్రప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన ఉపాధ్యాయ, కళా సేవలు భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం తన శేష జీవితాన్ని కళాసేవకు అంకితం చేయాలన్నారు.