SRD: సిర్గాపూర్ మండలం బొక్కస్‌గాం శివారు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కింద పడిన కరెంట్ తీగలు తగిలి ఓ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. కంగ్టి మండలం సాధు తండాకు చెందిన పండరి అనే రైతు కూలీ బొక్కస్‌గాం నీటి పరివాహక ప్రాంతానికి వలస వచ్చి పశువులు మేపుతుండగా ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
కరెంట్ షాక్‌తో ఆవు మృతి


