హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

ఉమ్మడి జిల్లాలోని రాయికోడ్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఆదివారం ఉలెన్ దుప్పట్లు పంపిణీ చేశారు. శీతాకాలంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వసతి గృహ అధికారులు, సిబ్బంది ఈ దుప్పట్లను అందజేశారు. కొత్త దుప్పట్లు అందడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.