హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాదం..150 గడ్డి మోపులు దగ్ధం

SRPT: మునగాల మండలం నారాయణగూడెం ఎస్సీ కాలనీ హైస్కూల్ సమీపంలోని గడ్డి వాములకు ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి మోపులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న సర్పంచ్ కాంపాటి వెంకట్ ఫైర్ సిబ్బందికి తెలియజేయడంతో పాటు గ్రామ ట్యాంకర్‌తో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు..