హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణా టిప్పర్ పట్టివేత

GDWL: జిల్లా కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తుండటంతో చర్యలు తీసుకున్నారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.