హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి కొయ్యలు తగలబెడుతున్న రైతులు

BHNG: వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నారు. పంట అవశేషాలు కాల్చడం వల్ల భూసారం తగ్గడంతో పాటు, పక్క పొలాల్లోని పంటలు, ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొయ్యలను తగలబెట్టకుండా దుక్కిలో కలియదున్నాలని ఏవో సూచించారు.