హైదరాబాద్: 28°C
తెలంగాణ

26న జిల్లా వ్యాప్తంగా రైతు సంఘం ధర్నా

JN: కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య తెలిపారు. జఫర్‌గడ్ మండలం కునూర్‌లో ఆదివారం ధర్నా పోస్టర్‌ను విడుదల చేశారు. రైతులకు అన్ని పంటలపై కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. రుణమాఫీ చేయాలన్నారు.