SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ చేసి, కార్తీకమాసం సందర్భంగా ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టారు.
తెలంగాణ
భీమేశ్వర స్వామి సేవలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి


