హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక ఆదివారం.. బాసరలో భక్తుల రద్దీ

NRML: కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం కావడంతో బాసర సరస్వతీ ఆలయం, గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడాయి. తెలంగాణ నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు జరిగాయి. ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.