WNP: ఆత్మకూరు, అమరచింత మండలాల్లో ఉన్న 300కు పైగా భూదాన్ భూములను భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని సర్వోదయ మండలి రాష్ట్ర కమిటీకి వనపర్తి జిల్లా కార్యదర్శి రాబర్ట్ విజ్ఞప్తి చేశారు. అలాగే పిన్నంచర్లలో 81 మందికి 30 ఏళ్ల క్రితం విక్రయించిన ప్లాట్లకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర నాయకులకు వినతి అందజేశారు.
తెలంగాణ
భూదాన్ భూములు పేదలకు పంపిణీ చేయాలి


