ADB: గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ, ముందు వెళ్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. లోపల చిక్కుకున్న డ్రైవర్‌ను హైవే సిబ్బంది స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
తెలంగాణ
సీతాగొంది వద్ద లారీల ఢీ.. డ్రైవర్ సేఫ్


