JGL పెగడపల్లి మండలం ఐతుపల్లిలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. తన పొలంలో దుక్కి దున్నుతున్న రైతు ఉత్తం పెద్దలు (52) ట్రాక్టర్ బురదలో కూరుకుపోవడంతో బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఇంజన్ కింద చిక్కుకున్న పెద్దలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామం శోకసంద్రంలో మునిగింది.
తెలంగాణ
VIDEO: పొలంలో దుక్కి దున్నుతూ ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి


