ADB: జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో యథేచ్ఛగా సాగుతున్న మాస్ కాపీయింగ్‌ను అరికట్టాలని పీడీఎస్‌యూ నాయకులు ఆదివారం డిమాండ్ చేశారు. పాస్ గ్యారెంటీ పేరుతో ప్రైవేటు కళాశాలలు రూ.10 వేల వరకు వసూలు చేస్తూ చూచిరాతలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. బాధ్యులైన కళాశాలల గుర్తింపు రద్దు చేసి, మైక్రో జిరాక్స్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌పై చర్యలు తీసుకోవాలి: పీడీఎస్‌యూ


