JN: కొడకండ్లలో LHPS నేతలు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న LHPS ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఛలో జనగామ కార్యక్రమ పోస్టర్ను సంఘం నాయకుడు డా. నరేందర్ పవార్ ఆవిష్కరించారు. లంబాడీల హక్కులు, తండాల అభివృద్ధి, పెండింగ్ సబ్సిడీల విడుదలకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కొడకండ్లలో చలో జనగామ పోస్టర్ ఆవిష్కరణ


