హైదరాబాద్: 28°C
తెలంగాణ

నలుగురి మృతిపై మాజీ ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

VKB: షేర్ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. రూ.3 వేల కోట్ల రోడ్ల అభివృద్ధి హామీని అమలు చేసి, అధ్వానంగా ఉన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.