హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలి: CPIML

BDK: మణుగూరులో ఆదివారం CPIML ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి బిక్షం పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 29న ప్రజా గర్జన, చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రజావ్యతిరేక విధానాలను విడిచి, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.