హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 1 నుంచి 3 వరకు సీపీఐ జైల్‌ భరో

ఖమ్మంలో 3 టౌన్ సీపీఐ సమావేశం అదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం వద్ద జైల్‌ భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు