HYD: రాంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్య అత్యవసర సేవలకు అడ్డంకిగా మారింది. ఆదివారం సిగ్నల్ సమీపంలో వాహనాల రద్దీ కారణంగా ప్రైవేట్ అంబులెన్స్ ముందుకు కదల్లేక నిలిచిపోయింది. నాగారం, రాంపల్లి ప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్‌లతో అంబులెన్సులు సైతం చిక్కుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్


