హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారు పతకం సాధించిన గురుకుల విద్యార్థులు

JGL: మెట్‌పల్లి మండలం వెంపేటలో ఇవాళ జరిగిన జగిత్యాల జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ రేస్లో మల్యాల మండలం తాటిపల్లి గురుకుల విద్యార్థిని సత్తా చాటింది. అండర్-18 బాలికల 4 కిలోమీటర్ల విభాగంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న మనీషా బంగారు పతకం సాధించినట్లు ప్రిన్సిపల్ మానస తెలిపారు. బంగారు పతకం సాధించిన మనీషాతో పాటు వ్యాయామ ఉపాధ్యాయురాలు మధులికను ప్రిన్సిపల్ అభినందించారు.