హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవంబర్ 23 నుంచి ఇంటింటికీ పోలియో చుక్కలు

MDCL: ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అల్వాల్‌లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలియో బూత్‌లలో చిన్నారులకు చుక్కలు వేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. నవంబర్ 23, 24, 25 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని వెల్లడించారు.