హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీలంతా ఐక్యంగా తరలిరావాలి: బీసీ జేఏసీ

BDK: ఢిల్లీలో డిసెంబర్ 14న నిర్వహించనున్న బీసీ జనభేరి మహాసభను విజయవంతం చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మణుగూరులో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. బీసీ హక్కులు, రిజర్వేషన్ల సాధనకు కులగణన చేపట్టాలని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.