KMR: ఎన్నికల సమయంలో MLA మదన్ మోహన్ ఇచ్చిన హామీ మేరకు ఎస్డీఎఫ్ నిధుల నుంచి మంజూరైన రూ.10 లక్షలతో ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఉస్మానియా మసీదు కమిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు, సయ్యద్ షా అబ్బాస్ షా వలీ నియాజ్ ఖానా నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కౌన్సిలర్లు సయ్యద్ గఫార్ ఉన్నారు.
తెలంగాణ
రూ.10 లక్షల అభివృద్ధి పనులకు భూమిపూజ


