హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఎయిర్ బ్యాగ్స్ కాపాడిన ప్రాణాలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్ సమీపంలో కల్వకుర్తి-కోదాడ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి సంగారెడ్డి వెళ్తున్న కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కారు ఓ వైపు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది.