WNP: ఖిల్లా ఘనపూర్ మండలంలోని ఘనపురం మోడల్ స్కూల్లో ఇంటర్ విద్యార్థులకు CLAT కోచింగ్ ఇచ్చేందుకు ఎక్స్టర్నల్ గెస్ట్ ఫ్యాకల్టీని నియమించనున్నట్లు వనపర్తి DEO యాదయ్య ఆదివారం తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఖిల్లా ఘనపూర్లోని మోడల్ స్కూల్లో ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం ఘనపురం మోడల్ స్కూల్లో సంప్రదించాలన్నారు.
తెలంగాణ
CLAT ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం


