హైదరాబాద్: 28°C
తెలంగాణ

కీసరగుట్టలో భక్తుల రద్దీ.. ట్రాఫిక్ జామ్

VKB: ఆదివారం సెలవు కావడంతో కీసరగుట్టలోని శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదే సమయంలో కీసర మీదుగా బొమ్మలరామారం, తుర్కపల్లి మార్గంలో యాదగిరిగుట్టకు వెళ్లే వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో కీసర ప్రధాన చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.