నిర్మల్ జిల్లాలో చలిపులి పంజా విసురుతోంది. తెల్లవారుజాము నుంచే ముధోల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటలకు ఎటుచూసినా మంచు మేఘాలే కనిపించడంతో జనజీవనం కొంతమేర మందగించింది. ముధోల్‌లోని నయాబాదిలో ఉన్న అంబేద్కర్ చౌరస్తా పూర్తిగా పొగమంచులో చిక్కుకుంది. దీంతో వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది.
తెలంగాణ
నిర్మల్ జిల్లాలో చలిపులి పంజా


