BDK: పాల్వంచలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేయాలని చెప్పారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
రేపు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి


