హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డితో వెళ్తున్న డీసీఎంలో మంటలు

RR: కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గడ్డితో వెళ్తున్న డీసీఎం వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో వాహనంలోని గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.