నిజామాబాద్: ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో ఈ నెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నల్లవెల్లికి చెందిన కార్ల సాయిలు చికిత్స పొందుత ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కామారెడ్డి నుంచి స్వగ్రామానికి వస్తుండగా కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయిలును జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో గాయపడి వ్యక్తి మృతి


