హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలీల సమస్యలపై గళం ఎత్తిన మల్లేశ్

BHPL: జార్ఖండ్ రాష్ట్రం గిరిడి జిల్లా సరియా పట్టణంలో జరుగుతున్న అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్ పలు డిమాండ్లను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. దళితులకు అసైన్డ్ భూములపై హక్కు పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం కల్పించాలన్నారు.