SDPT: రెండు రోజుల క్రితం చేర్యాల మండలం చుంచనకోట క్రాస్ వద్ద నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడటంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడు రమేశ్ (35) స్వస్థలం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


