హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెటా కార్యాలయం వద్ద ఏం జరిగింది?

HYD: మాదాపూర్‌లోని మెటా కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన ఆందోళనపై రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ స్పందించారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లామని, అయితే లోపలికి అనుమతించలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతల పోస్టులను ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆదేశాలతో మెటా తొలగిస్తోందని ఆరోపించారు. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని మూడు గంటల తర్వాత విడుదల చేశారు.