హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు: కేడం లింగమూర్తి

SDPT: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే హోదాను మరిచి మాట్లాడుతున్నారని సిద్దిపేట మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కేడం లింగమూర్తి విమర్శించారు. సీఎం సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ విషయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో సభల్లో ప్రమాదాలు జరిగినప్పుడు కేసీఆర్ బాధితులకు పరిహారం అందించలేదా? అని ప్రశ్నించారు.