హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిరుత సంచారం.. రైతుల్లో కలవరం

VKB: పరిగి మండలం నస్కల్ గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. కృష్ణ అనే రైతు పొలం వద్ద పశువులను మేపుతుండగా చిరుత దాడికి యత్నించిందని సమాచారం. దానిని చూసి తీవ్ర భయాందోళనకు గురైన కృష్ణ పరుగులు తీస్తూ కుప్పకూలిపోయాడు. సమీప పొలాల్లో ఉన్న రైతులు గమనించి వెంటనే అతడిని పరిగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.