SRD: కంగ్టి మండలం భీమ్రా పోలియో కేంద్రాన్ని ఆదివారం మండల వైద్యాధికారి డాక్టర్ నాగమణి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. మిగిలిపోయిన చిన్నారులకు రేపు, ఎల్లుండి ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.
తెలంగాణ
'పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి'


