హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలల్లో భద్రత కరువు.. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు!

NRPT: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల మరికల్ (M) తిలేరు పాఠశాలలో ప్రహరీ గోడ కూలి ఇద్దరు విద్యార్థులు గాయపడటం కలకలం రేపింది. గతంలో వసతి గృహంలో అగ్నిప్రమాదం కూడా చోటుచేసుకుంది. పాఠశాల భవనాలు, ప్రహరీలు, విద్యుత్‌ వ్యవస్థలను అధికారులు తనిఖీ చేసి భద్రతకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.