హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల నమోదు వేగవంతం చేయాలి: కమిషనర్

MBNR: జడ్చర్లలో ఆర్‌పీలతో సమావేశమైన మున్సిపల్ కమిషనర్ గిరీష్, ఇందిరమ్మ జీవిత బీమా పథకం దరఖాస్తుల ఆన్‌లైన్ నమోదు వేగవంతం చేయాలని సూచించారు. బీమా పొందే వ్యక్తి మొబైల్ నంబర్‌నే నమోదు చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. కంప్యూటర్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.