హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి వృథా

GDWL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మహిళల మెడికల్ వార్డు బాత్రూంలో నల్లా లీకేజీతో రోజుల తరబడి నీరు వృథాగా పోతున్నది. ఎల్‌నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా, ప్రభుత్వ ఆసుపత్రిలో నీరు వృథా కావడం విచారకరం. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.