హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడ గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.