హైదరాబాద్: 28°C
తెలంగాణ

మందనపల్లి తొలి సర్పంచ్ కామ్రేడ్ మృతి

BHNG: ఆలేరు మండలం మందనపల్లి గ్రామ తొలి సర్పంచ్, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకురాలు కామ్రేడ్ డొంకెన నాగమణి ఈ రోజు అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతికి పార్టీ శ్రేణులు విప్లవ జోహార్లు అర్పించాయి. పేదల హక్కులు, గ్రామ అభివృద్ధి, మహిళా చైతన్యం కోసం ఆమె చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.