హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివో, పంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

MNCL: గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కాసిపేట గ్రామంలో వివో, లక్ష్మీకాంతపూర్ లో పంచాయతీ కార్యాలయం భవనాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రతి గ్రామపంచాయతీకి సొంత భవనం ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.