హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్ల జాబితా అడ్డుకునే వారంతా దేశద్రోహులే'

KNR: కరీంనగర్ గురుద్వార్ వద్ద ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. ఓటర్ల జాబితా సవరణను అడ్డుకునే వాళ్లంతా దేశ ద్రోహులేనని అన్నారు. బీజేపీ అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయమని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై బీజేపీని అడ్డుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తథ్యమన్నారు.