హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

MHBD: ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలోని బాబు నాయక్ తండాలో టౌన్ సీఐ, పోలీసు సిబ్బంది సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిజిటల్ భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమానాస్పద లింకులు తెరవద్దన్నారు.