హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిట్టలదొర వేషధారణలో వినూత్న ప్రచారం

SRPT: పిట్టలదొర వేషధారణతో హాస్యం పంచుతూనే సామాజిక చైతన్యం కలిగిస్తున్నారు మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. ఆదివారం కోదాడ వారసంతలో ఆయన వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. యువత గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలను తనదైన శైలిలో వివరించారు.