హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ

NGKL: పదర మండలం మద్దిమడుగు ఆంజనేయస్వామిని నాగర్ కర్నూల్ MP మల్లు రవి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆదివారం దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఈనెల 26న మద్దిమడుగు లో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాల్గొన్నారు.