హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని వినతి

NGKL: అమ్రాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని ఉమ్మడి అమ్రాబాద్ మండల సాగునీటి సాధన సమితి కోరింది. ఈ మేరకు అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో MLA చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవికి ఇవాళ వినతిపత్రం అందజేశారు. CM రేవంత్ రెడ్డికి ఈ సమస్యను వివరించి, నల్లమల ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.