హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక ర్యాంపులను రద్దు చేయాలని డిమాండ్

BDK: భద్రాచలంలో ఇసుక ర్యాంపులను సంపూర్ణంగా రద్దు చేయాలని లోక్ రక్షక్ పార్టీ వ్యవస్థాపకుడు కొండా చరణ్ డిమాండ్ చేశారు. ఇసుక లారీల రాకపోకలతో ప్రజలు అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, రైతులు పంట నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది మంది లాభాల కోసం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని అన్నారు. ఈ మేరకు కరపత్రం విడుదల చేశారు.