హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెగా జాబ్ మేళాను ప్రారంభించిన MLA కోవ లక్ష్మి

ASF: మోడల్ స్కూల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను MLA కోవ లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ మేళాలో 40 ప్రముఖ కంపెనీలు పాల్గొని 2 వేల ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన వందలాది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. ఎంపికైన వారికి రూ.14-25 వేల వరకు వేతనం లభించనుంది.