హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన నిర్మల్ విద్యార్థిని

నిర్మల్: రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన నిర్మల్ విద్యార్థిని అనుముల శ్రీ వైభవి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 16న హైదరాబాద్‌లో జరిగిన అండర్-14 రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించింది. నవంబర్ 25 నుంచి 29 వరకు మధ్య ప్రదేశ్‌లో జరిగే జాతీయ పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.