KMR: రాజంపేట మండలం బస్వన్నపల్లిలో భవిష్యత్తులో నీటి సమస్య తలెత్తకుండా గ్రామ సేవా సమితి సభ్యులు ఆదివారం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలు, యువకులు కలిసి సమితిని ఏర్పాటు చేసుకుని నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నీటి బొట్టును కాపాడుకోవడం అందరి బాధ్యత అని, నీరే జీవనాధారమని వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
తెలంగాణ
నీటి ఎద్దడి నివారణకు గ్రామస్తుల ముందస్తు చర్యలు


